Friday, April 19, 2024

నెట్ ప్లిక్స్ లో అమిగోస్

అమిగోస్ చిత్రంతో ద‌ర్శ‌కుడిగా రాజేంద‌ర్ రెడ్డి ప‌రిచ‌య‌మ‌య్యాడు.ఈ సినిమా ఈ రోజు నుంచి ‘నెట్ ఫ్లిక్స్’ లో స్ట్రీమింగ్ అవుతోంది. ఓటీటీ ఫ్లాట్ ఫామ్ నుంచి ఈ సినిమాకి మంచి రెస్పాన్స్ వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఈ మూవీలో హీరో క‌ల్యాణ్ రామ్ త్రిపాత్రాభిన‌యం చేశాడు. ఫిబ్రవరి 10వ తేదీన థియేటర్లకు వచ్చింది. మైత్రీ మూవీ మేకర్స్ వారు నిర్మించిన ఈ సినిమాతో, దర్శకుడిగా రాజేందర్ రెడ్డి పరిచయమయ్యాడు. ఈ సినిమాతోనే ఆషిక రంగనాథ్ టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చింది. నిజానికి కల్యాణ్ రామ్ ఎంచుకున్న లైన్ కొత్తదే. ఈ కథలో ఇంట్రెస్టింగ్ పాయింట్ ఉంది. ఒక వ్యక్తిని పోలిన వ్యక్తులు ఉంటే ఎలాంటి ఇబ్బందులు ఎదురయ్యే అవకాశాలు ఉన్నాయనేది చెప్పడమే కథలోని ప్రధానమైన అంశం. కథకి ఆషిక గ్లామర్ కూడా బాగానే తోడైంది. ఎన్నో రాత్రులొస్తాయిగానీ అనే రీమిక్స్ తప్ప మిగతా పాటలు ఆకట్టుకోవు.

Advertisement

తాజా వార్తలు

Advertisement