Wednesday, April 24, 2024

అమెజాన్‌ ప్రైమ్‌ మెంబర్‌ షిప్‌ ఫ్రీగా పొందాలంటే ఇలా చేయండి..

ఓటీటీ ప్లాట్ ఫామ్ అమెజాన్ ప్రైమ్‌ కు ఎంతటి ఆదరణ ఉందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు.. ప్రైమ్‌ మెంబర్‌షిప్‌ తీసుకున్న వారికి అమెజాన్‌ ప్రైమ్‌ వీడియో, ప్రైమ్‌ మ్యూజిక్‌, వేగవంతమైన డెలివరీ సేవలను అమెజాన్‌ అందిస్తోంది. అయితే ప్రైమ్‌ మెంబర్‌ షిప్‌ కోసం సంవత్సరానికి రూ.999 అమెజాన్‌ వసూలు చేస్తోంది. మీరు అమెజాన్‌ ప్రైమ్‌ మెంబర్‌ షిప్‌కు ఎలాంటి డబ్బులను చెల్లించకుండా ఉచితంగా సేవలను పొందాలనుకుంటున్నారా.? అయితే ఖచ్చితంగా ఈ రెండు అంశాలు ఉండాల్సిందే..

అమెజాన్‌ ప్రైమ్‌ మెంబర్‌ షిప్‌కు ఎలాంటి డబ్బులను చెల్లించకుండా సేవలను ఉచితంగా పొందాలంటే మీరు కచ్చితంగా ఎయిర్‌టెల్‌ లేదా జియో ఫైబర్‌ కల్గిఉన్న వినియోగదారుడై ఉండాలి. ఎయిర్‌టెల్‌ తన కస్టమర్లకు పలు రీఛార్జ్‌లపై అమెజాన్‌ ప్రైమ్‌ మెంబర్‌ షిప్‌ను నెల రోజులపాటు ఉచితంగా అందిస్తోంది. ఎయిర్‌టెల్‌ వినియోగదారులు రూ .349, రూ. 299 రిచార్జ్‌ చేస్తే 30 రోజులపాటు అమెజాన్‌ ప్రైమ్‌ సబ్‌స్క్రిప్షన్‌ను ఉచితంగా పొందవచ్చును.

ఎయిర్‌టెల్‌తో పాటుగా జియో ఫైబర్‌ కూడా  ఉచిత  అమెజాన్ ప్రైమ్‌ సబ్‌స్క్రిప్షన్‌ అందిస్తోంది. జియోఫైబర్‌కు సంబంధించిన 999,1499, 2499,3999,8499 ప్లాన్లతో రీచార్జ్‌ చేస్తే అమెజాన్‌ ప్రైమ్‌ సబ్‌స్క్రిప్షన్‌ను ఉచితంగా పొందవచ్చును.

ఇది కూడా చదవండి: అలర్ట్: సెకండ్ వేవ్ ముప్పు ఇంకా ఉందట..?

Advertisement

తాజా వార్తలు

Advertisement