Tuesday, April 23, 2024

హీరోలతో పాటు హీరోయిన్స్ కూడా వచ్చేస్తున్నారు..!! పవన్ కొత్త సినిమా అప్డేట్

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ రానా దగ్గుబాటి ప్రధాన పాత్రలలో సాగర్ కే చంద్ర దర్శకత్వంలో మలయాళం సూపర్ హిట్ మూవీ అయ్యప్పనుమ్ కొషియమ్ రీమేక్ చిత్రం తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాకు మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ కథ-స్క్రీన్ ప్లే అందిస్తుండడం విశేషం. ఇక కరోనా కారణంగా వాయిదా పడ్డ ఈ సినిమా షూటింగ్ షూటింగ్ ను ప్రారంభించేందుకు యూనిట్ సిద్ధమవుతోంది. ఇక ఈ షెడ్యూల్ లో పవన్ రానా కూడా సెట్స్ పైకి రానున్నారట. అలాగే ఎప్పటి నుంచో ఎదురుచూస్తున్న హీరోయిన్ ల విషయంలో కూడా క్లారిటీ వచ్చే సమయం కూడా ఆసన్నమైనప్పుడు తెలుస్తోంది.

ఈ తాజా షెడ్యూల్ లో హీరోయిన్స్ కూడా జాయిన్ కాబోతున్నారట. హీరోయిన్ నిత్యా మీనన్ ఐశ్వర్య రాజేష్ లు ఎంపికైనట్లు గత కొన్ని రోజులుగా ప్రచారం జరుగుతోంది. అయితే అధికారిక ప్రకటన మాత్రం రాలేదు. నిత్య మీనన్ పవన్ కళ్యాణ్ భార్య పాత్రను పోషిస్తుండగా… ఐశ్వర్య రాజేష్ రానా కు భార్య గా నటించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. త్వరలోనే ఇందుకు సంబంధించి క్లారిటీ రానుంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement