Monday, March 25, 2024

4మిలియన్ ఫాలోవర్స్@ అల్లు స్నేహ

సినీస్టార్ కి సోషల్ మీడియాలో ఉండే ఫాలోయింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. అలాగే హీరోలతో పాటు వారి భార్యలకు కూడా సోషల్ మీడియాలో మంచి ఫాలోయింగ్ ఉంటుంది. వారి భర్తల సినిమాలకు సంబంధించి అప్డేట్ తో పాటు ఫ్యామిలీ ఫోటోలను కొత్త కొత్త స్టిల్స్ ని పోస్ట్ చేస్తూ ఉంటారు. అయితే అల్లు అర్జున్ భార్య స్నేహారెడ్డి గురించి ప్రత్యేకంగా పరిచయం చేయనవసరం లేదు. సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే స్నేహ అల్లు అర్జున్ సినిమాలకు సంబంధించి అప్డేట్స్ తో పాటు ఫ్యామిలీ ఫోటోలను పోస్ట్ చేస్తూ ఉంటారు.

కాగా తాజాగా ఇంస్టాగ్రామ్ లో నాలుగు మిలియన్ల ఫాలోవర్స్ ని సొంతం చేసుకున్నారు. పాన్ ఇండియా స్థాయిలో సినీ స్టార్స్ కి లేని ఫాలోయింగ్ ను సొంతం చేసుకున్నారు స్నేహ. నిజానికి చాలా మంది హీరోయిన్ లకు కూడా ఇంత మంది ఫాలోవర్స్ లేరు. ఈ సందర్భంగా ఆమె కి నెటిజన్స్ విషెస్ తెలియజేస్తున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement