Thursday, April 25, 2024

స్టైలిష్ లుక్ లో అల్లు శిరీష్

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ సోదరుడు ,అల్లు అరవింద్ మూడవ కుమారుడు అల్లు శిరీష్ కెరీర్ ను ప్రారంభించి చాలా ఏళ్ళు అవుతుంది. ఇప్పటికే మూడు నాలుగు సినిమాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. అయితే అవి కూడా అనుకున్న స్థాయిలో ఆకట్టుకోలేకపోయాయి. కాగా ఇటీవల అల్లు శిరీష్ బాడీ ఫిట్నెస్ పై ఫోకస్ పెట్టాడు. జిమ్ లో విపరీతంగా వర్కౌట్స్ చేస్తూ అందుకు సంబంధించిన వీడియోలను పోస్ట్ చేసేవాడు.

అయితే తాజాగా ఇంస్టాగ్రామ్ లో స్టైలిష్ లుక్ లో ఫోటోని పోస్ట్ చేశాడు. ఆ ఫోటోలో బ్లాక్ టీ షర్ట్, జీన్స్ ప్యాంట్ తో పాటు దానికి సరిపడా జాకెట్లు వేసుకొని కళ్లద్దాలు పెట్టుకొని స్టైల్ గా కనిపించాడు. ఇక ఫోటో చూసిన మెగా అభిమానులకు అల్లు అర్జున్ కి శిరీష్ స్టైల్లో పోటీగా వస్తున్నాడని కామెంట్స్ చేస్తున్నారు. ఇక సినిమాల విషయానికొస్తే అల్లు శిరీష్ ప్రస్తుతం ప్రేమ కాదంట అనే సినిమా చేస్తున్నాడు.

Advertisement

తాజా వార్తలు

Advertisement