Saturday, June 12, 2021

ఫస్ట్ అండ్ ఫాస్టెస్ట్…ఓన్లీ పుష్ప !!

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ సుకుమార్ దర్శకత్వంలో ప్రస్తుతం పుష్ప సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. గంధపు చెక్కల స్మగ్లింగ్ నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో అల్లు అర్జున్ లారీ డ్రైవర్ పుష్ప రాజ్ గా కనిపించబోతున్నాడు. అలాగే సినిమాలో హీరోయిన్ గా కూడా రష్మిక మందన్నా నటిస్తోంది. ఇదిలా ఉండగా అల్లు అర్జున్ పుట్టిన రోజు సందర్భంగా ఏప్రిల్ 7వ తేదీన సినిమా టీజర్ ని చిత్ర యూనిట్ రిలీజ్ చేసింది.

ఈ టీజర్ 70 మిలియన్ ల వ్యూస్ ని క్రాస్ చేసింది. అంతేకాకుండా 1.6 మిలియన్ లైక్ ను కూడా సొంతం చేసుకుంది. ఫస్ట్ అండ్ ఫాస్టెస్ట్ గా ఈ మైలురాయిని అందుకున్న ఈ చిత్రం తమిళంతో పాటు తెలుగు కన్నడ మలయాళ హిందీ భాషల్లో ఈ చిత్రాన్ని రిలీజ్ చేయబోతున్నారు. ఇక ఈ సినిమాలో మలయాళ స్టార్ నటుడు ఫహాద్ విలన్ గా కనిపించబోతున్నాడు.

Advertisement

తాజా వార్తలు

Prabha News