Wednesday, April 24, 2024

బాలనటిగా అల్లుఅర్జున్ కూతురు ఎంట్రీ ?

అల్లు అర్జున్ కూతురు అల్లు అర్హ గురించి ప్రత్యేకంగా పరిచయం చేయనవసరం లేదు. అటు అల్లుఅర్జున్ గాని అలాగే ఆయన భార్య స్నేహ గాని అర్హ కు సంబంధించిన వీడియోలను ఫోటోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తూ ఉంటారు. అయితే ఇప్పుడు అల్లు అర్హ బాలనటిగా ఎంట్రీ ఇవ్వబోతున్నట్లు తెలుస్తోంది.

స్టార్ ప్రొడ్యూసర్ దిల్ రాజు నిర్మిస్తున్న ఓ చిత్రంలో బాలనటిగా అల్లు అర్హ ఎంట్రీ ఇవ్వబోతున్నారట. చిన్నపిల్లల తో దిల్ రాజు ఓ చిత్రాన్ని తెరకెక్కించేందుకు ప్లాన్ చేస్తోండగా… ప్రధాన పాత్రకు అర్హ ను ఎంపిక చేసుకున్నారట. అలాగే ఇండస్ట్రీకి చెందిన మరికొంతమంది వారసులను కూడా ఇందులో చూపించబోతున్నారట. ఈ సినిమాకు సంబంధించి పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement