Thursday, April 25, 2024

జెర్సీ డైరెక్టర్ తో అల్లు అర్జున్ ?

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ ప్రస్తుతం సుకుమార్ దర్శకత్వంలో పుష్ప సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. గంధపు చెక్కల స్మగ్లింగ్ నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో అల్లు అర్జున్ లారీ డ్రైవర్ పుష్ప రాజ్ గా కనిపించబోతున్నాడు. అయితే ఈ సినిమా తర్వాత అల్లు అర్జున్ ఎవరితో సినిమా చేయబోతున్నాడు అనేదానిపై ఇంకా అధికారిక ప్రకటన రాలేదు.

కాగా తాజాగా అల్లు అర్జున్ తన తర్వాత సినిమా యంగ్ డైరెక్టర్ తో చేయబోతున్నట్లు తెలుస్తోంది. అతను మరెవరో కాదు… జెర్సీ సినిమాతో దర్శకుడిగా మంచి పేరు తెచ్చుకున్న గౌతమ్ తిన్ననూరి. గౌతమ్ తిన్ననూరి ప్రస్తుతం జెర్సీ హిందీ రీమేక్ తెరకెక్కిస్తున్నాడు. కాగా ఇప్పటికే అల్లు అర్జున్ కి ఒక కథ చెప్పాడట గౌతమ్. అది బన్నీ కి కూడా నచ్చడంతో ఓకే చెప్పినట్లు తెలుస్తోంది. 2022 లో వీరి సినిమా స్టార్ట్ కాబోతునట్లు సమాచారం.

Advertisement

తాజా వార్తలు

Advertisement