Friday, April 19, 2024

అలా వైకుంఠపురములో మరో రికార్డు

మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ దర్శకత్వంలో స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా ప్రేక్షకుల ముందుకు వచ్చిన చిత్రం అలా వైకుంఠపురములో. 2020 సంక్రాంతి సందర్భంగా ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద ఘన విజయం సాధించింది. అదేవిధంగా మ్యూజికల్ గా కూడా సూపర్ డూపర్ హిట్ సాదించింది. సినిమా సక్సెస్ లో మ్యూజిక్ కీలక పాత్ర పోషించింది. అందులో ముఖ్యంగా బుట్ట బొమ్మ, సామజ వరగమన పాటలకు తమన్ ఇచ్చిన మ్యూజిక్ కు ఆడియన్స్ నుంచి అదిరిపోయే రెస్పాన్స్ వచ్చింది.

ఇక ఇప్పటికే ఈ సినిమా పాటలు పలు రికార్డులను సొంతం చేసుకోగా… తాజాగా ఆల్బమ్ మొత్తం కలిపి ఓ రికార్డును నెలకొల్పింది. అన్ని పాటలు కలిపి రెండు బిలియన్ వ్యూస్ మార్కును క్రాస్ చేసి దక్షిణాది సినిమాల్లో ఫస్ట్ ఎవర్ రికార్డును సెట్ చేసింది. ఇక ప్రస్తుతం అల్లు అర్జున్ సుకుమార్ దర్శకత్వంలో పుష్ప సినిమా చేస్తున్నాడు. ఈ సినిమాకు దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నాడు.

Advertisement

తాజా వార్తలు

Advertisement