Friday, June 18, 2021

బన్నీ లిస్ట్ లో మరో దర్శకుడు ?

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ ప్రస్తుతం సుకుమార్ దర్శకత్వంలో పుష్ప సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. పాన్ ఇండియా చిత్రంగా తెరకెక్కుతున్న ఈ చిత్రంలో లారీ డ్రైవర్ పుష్పరాజ్ గా కనిపించబోతున్నాడు అల్లుఅర్జున్. ఇక ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించి విడుదలై న టీజర్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంది. రికార్డు స్థాయిలో వ్యూస్ సంపాదించింది. అయితే ఈ సినిమా తర్వాత వరుస సినిమాలను లైన్ లో పెట్టాడు అర్జున్.

ఇప్పటికే దర్శకుడు ప్రశాంత్ నీల్, తమిళ దర్శకుడు ఏఆర్ మురుగదాస్, లైన్ లో ఉండగా లేటెస్ట్ గా వంశీ పైడిపల్లి పేరు వినిపిస్తోంది. అయితే ఇందులో ఎంతవరకు నిజం ఉందో తెలియదు. దీనిపై క్లారిటీ రావాలంటే ఎవరో ఒకరు అధికారికంగా స్పందించాల్సి ఉంది. ప్రస్తుతం బన్నీ కరోనా పాజిటివ్ కారణంగా ఇంట్లోనే ఉంటున్నారు.

Advertisement

తాజా వార్తలు

Prabha News