Wednesday, April 24, 2024

పుష్ప ఫైట్ కూడా లీకయింది..

స్టైలీస్ స్టార్ అల్లు అర్జున్ సుకుమార్ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న మూవీ పుష్ప.. ఇటీవల ఈ మూవీ నుంచి విడుదలయిన లిరికల్ సాంగ్ హిట్ కావడంతో మాస్ ఆడియన్స్ లో మంచి క్రేజ్ సంపాదించుకుంది. ఈ సినిమా డిసెంబర్ 25 న విడుదల కానుంది. అయితే అప్పుడే ఈ సినిమాకు లీకుల బెడద పట్టి పీడిస్తోంది. ‘పుష్ప’ మూవీ నుంచి కొన్ని పిక్స్, పాట ముందే బయటకు రావడంతో చిత్ర నిర్మాతలు సైబర్ క్రైమ్ పోలీసులను ఆశ్రయించారు. చిత్ర యూనిట్ లీకులపై ఫిర్యాదు చేసిన తక్కువ సమయంలోనే ‘పుష్ప’ మూవీ నుంచి మరో వీడియో లీకైంది. అల్లు అర్జున్ ఫైటింగ్ చేస్తున్న దృశ్యాలు కనిపించాయి. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతోంది. దీనిపై అల్లు అర్జున్ అభిమానులు రిపోర్టులు కొడుతుండగా.. చాలా మంది మాత్రం భారీ స్థాయిలో షేర్లు చేస్తున్నారు. ఎడిటింగ్ రూమ్ లో ఉన్న సమయంలో వీడియోను రికార్డు చేసినట్లు తెలుస్తోంది.

ఇది ఖచ్చితంగా చిత్ర యూనిట్ పనే అయ్యింటుందని భావిస్తూ ఉన్నారు. అల్లు అర్జున్ ఫైట్ చేస్తుండగా రీసౌండ్లు వస్తున్నాయి. ఇలా మూవీ యూనిట్ నుంచి లీకులు జరుగుతుండడం ఆందోళన కలిగిస్తుండడంతో ముందు ఇంటి దొంగలనే పట్టుకోవాలని నిర్మాతలకు అల్లు అర్జున్ అభిమానులు చెబుతున్నారు.

ఇది కూడా చదవండి: కోహ్లీకి కౌంటర్ ఇచ్చిన బ్రాడ్.. అవును లార్డ్స్ అండర్సన్ జాగీరే..!!

Advertisement

తాజా వార్తలు

Advertisement