Tuesday, April 23, 2024

ఐకాన్ స్టార్ ఐఫోన్ కొట్టేశారట ?

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ సుకుమార్ దర్శకత్వంలో పుష్ప సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. కాగా ఈ సినిమాకు సంబంధించి అల్లు అర్జున్ పుట్టినరోజు సందర్భంగా ఫస్ట్ మీటింగ్ ఏర్పాటు చేసి టీజర్ ను రిలీజ్ చేసింది చిత్ర యూనిట్. ఈ కార్యక్రమానికి డైరెక్టర్ సుకుమార్, అల్లు అర్జున్, అల్లు శిరీష్ తో పాటు పెద్ద ఎత్తున అభిమానులు కూడా పాల్గొన్నారు. కాగా ఒకానొక సమయంలో అభిమానులు ఒక్కసారిగా బన్నీ చుట్టుముట్టేయడంతో ఇబ్బంది పడ్డాడు.

అయితే ఆ సమయంలో బన్నీ ఫోన్ మిస్ అయిందట. కాగా ఈ విషయంపై చిత్ర యూనిట్ గాని బన్నీ తరఫునుంచి కానీ ఎలాంటి స్పందన రాలేదు. కానీ ఈ విషయంపై ఫిలింనగర్ లో మాత్రం చర్చ నడుస్తుంది. ఇదిలా ఉండగా పుష్ప టీజర్ సోషల్ మీడియా లో దూసుకుపోతుంది. అల్లు అర్జున్ నటన కూడా అందరినీ ఆకట్టుకుంటుంది. తగ్గేదేలే అంటూ బన్నీ చెప్పిన డైలాగ్ మాస్ ప్రేక్షకులకు మరింత నచ్చేస్తుంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement