Thursday, March 28, 2024

గని సెట్ లో అల్లుఅర్జున్

కిరణ్ కొర్రపాటి దర్శకత్వంలో మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ హీరోగా తెరకెక్కుతున్న చిత్రం గని. బాక్సింగ్ నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో బాక్సర్ గా వరుణ్ తేజ్ కనిపించబోతున్నారు. అలాగే ఈ సినిమాలో సాయి మంజ్రేకర్ వరుణ్ సరసన హీరోయిన్ గా నటిస్తోంది. అలాగే ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్ కుమారుడు అల్లు బాబీ ఈ సినిమాను నిర్మిస్తున్నారు.

ఇదిలా ఉండగా గని సెట్లో అడుగుపెట్టారు స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్. ఈ విషయాన్ని సోషల్ మీడియా ద్వారా చెబుతూ ఓ పోస్ట్ చేశారు. గని బాక్సింగ్ నైపుణ్యాలు, ట్రాన్స్ఫర్మేషన్ గురించి మనందరికీ ఆసక్తి ఉంది అంటూ చెప్పుకొచ్చాడు. అయితే ఆ ఫోటోలో అల్లు బాబీ,అల్లు అర్జున్ కనిపించారు. కాని వరుణ్ మాత్రం అందులో కనిపించలేదు. ఈ సినిమాతో నిర్మాతగా బాబీ ఎంట్రీ ఇస్తున్న సంగతి తెలిసిందే.

Advertisement

తాజా వార్తలు

Advertisement