Monday, October 18, 2021

F3 సెట్ లో అల్లు అర్జున్ సందడి..

సూపర్ హిట్ మూవీ ఎఫ్ 2 చిత్రానికి సీక్వెల్ గా తెరకెక్కుతున్న చిత్రం ఎఫ్ 3. వెంక‌టేష్‌, వ‌రుణ్ తేజ్ ప్ర‌ధాన పాత్ర‌ల్లో నటిస్తుండగా త‌మ‌న్నా, మెహ‌రీన్, సునీల్ ,రాజేంద్ర ప్ర‌సాద్ కీలక పాత్ర‌లు పోషిస్తున్నారు. కాగా ఎఫ్ 3 సెట్లో అల్లు అర్జున్ సందడి చేశారు. ప్ర‌స్తుతం హైద‌రాబాద్‌లో చిత్రీక‌ర‌ణ జ‌రుగుతుండ‌గా, స‌డెన్‌గా సెట్‌ని విజిట్ చేశాడు అల్లు అర్జున్. వెంక‌టేష్‌, వ‌రుణ్ తేజ్‌తో పాటు ప‌లువురు స్టార్స్‌తో క‌లిసి కాసేపు ముచ్చ‌టించాడు. ప్ర‌స్తుతం ఈ పిక్స్ సోష‌ల్ మీడియాలో వైర‌ల్‌గా మారాయి.

ఒరిజిన‌ల్ చిత్రంతో పోలిస్తే ఎఫ్ 3 ప్రేక్ష‌కుల‌ని పొట్ట చెక్క‌ల‌య్యేలా న‌వ్విస్తుంద‌ని అంటున్నారు. ఎఫ్ 3 మూవీ డబ్బులతో వచ్చే సమస్యల చుట్టూ అల్లుకున్నట్టు సమాచారం. ఇది ఫస్ట్ లుక్ పోస్టర్‌తోనే ఖరారు చేసారు ఈ దర్శకుడు. ఇక బ‌న్నీ విష‌యానికి వ‌స్తే ప్ర‌స్తుతం ఆయ‌న పుష్ప సినిమా చేస్తున్నాడు. డిసెంబ‌ర్ 17న చిత్రం విడుద‌ల కానుండ‌గా, మూవీ ప్ర‌మోష‌న్స్ వేగ‌వంతం చేశారు. రష్మిక మందన్నపై చిత్రీకరించిన శ్రీవల్లి పాటను అక్టోబర్ 13న విడుదల చేయనున్నారు.

ఇది కూడా చదవండి: ఏపీలోని స్కూళ్లకు దసర సెలవులు ఎప్పుడంటే..

Advertisement

తాజా వార్తలు

Advertisement
Prabha News