Wednesday, April 24, 2024

అల్లు అర్జున్ రెడి…!!

సుకుమార్ దర్శకత్వంలో అల్లు అర్జున్ హీరోగా తెరకెక్కుతున్న చిత్రం పుష్ప. గంధపు చెక్కల స్మగ్లింగ్ నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ సినిమాను రెండు పార్టులుగా రిలీజ్ చేయబోతున్న సంగతి తెలిసిందే. అయితే ఈ సినిమా మొదటి పార్ట్ కు సంబంధించి చాలా వరకు షూటింగ్ ను పూర్తి చేశారు చిత్రయూనిట్. మిగిలిన భాగం కు సంబంధించిన షూటింగ్ పెండింగ్ ఉంది. ఇప్పుడిప్పుడే షూటింగ్ లకు అనుమతులు లభిస్తుండడంతో అల్లు అర్జున్ కూడా షూట్ కు రెడీ అవుతున్నాడు.

కాగా జూలై మొదటి వారంలో హైదరాబాదులో షూటింగ్ ను రీస్టార్ట్ చేయనున్నారు. అయితే ఈ షెడ్యూల్ లోనే మొత్తం ముగించాలని ప్లాన్ చేస్తుందట చిత్రయూనిట్. ఇక ఈ షెడ్యూల్ లో అల్లు అర్జున్, రష్మిక మందన్న,ఫహాద్ ఫాజిల్ అందరూ షూటింగులో జాయిన్ కాబోతున్నారట. అయితే మొదటి పార్ట్ ఈ ఏడాదిలోనే రిలీజ్ చేయనున్నారు. రెండవ పార్ట్ వచ్చే ఏడాది రిలీజ్ చేయనున్నారు. కాగా రిలీజ్ డేట్ పై మాత్రం ఇంకా క్లారిటీ రాలేదు. త్వరలోనే ఈ విషయమై ఓ క్లారిటీ వచ్చే అవకాశం ఉంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement