Thursday, April 25, 2024

దేవుడు గా అల్లు అర్జున్ ?

తమిళనాట సూపర్ హిట్ సాధించిన ఓ మై కడవులే సినిమాను తెలుగులో రీమేక్ చేయబోతున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాలో విశ్వక్ సేన్ హీరోగా నటిస్తున్నాడు. అలాగే మిథిలా పాల్కర్ హీరోయిన్ గా నటిస్తోంది. ఈ సినిమాను పివిపి సినిమాస్ మరియు శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. అయితే తమిళ వెర్షన్ లో కోలీవుడ్ విలక్షణ నటుడు స్టార్ హీరో విజయ్ సేతుపతి దేవుడి పాత్రలో కనిపించారు.

కాగా తెలుగులో ఆ పాత్రను ఎవరు చేస్తారు అనే దానిపై ఇప్పుడు సోషల్ మీడియా లో ఓ వార్త వైరల్ అవుతుంది. ఆ పాత్రలో స్టైలిష్ స్టార్ అల్లుఅర్జున్ నటించబోతున్నట్లు టాక్ నడుస్తోంది. గతంలో రుద్రమదేవి సినిమాలో గోన గన్నారెడ్డి గా క్యామియో రోల్ లో అల్లు అర్జున్ నటించారు. అయితే ఈ సినిమాకు సంబంధించి అల్లు అర్జున్ పాత్ర పైఅధికారిక ప్రకటన మాత్రం ఎక్కడా రాలేదు. మరి చూడాలి ఇందులో ఎంతవరకు నిజం ఉందో.

Advertisement

తాజా వార్తలు

Advertisement