Saturday, April 20, 2024

వర్సటైల్​ యాక్టర్​గా అల్లరి నరేశ్​.. “ఉగ్రమ్”​ గ్లింప్స్​ని రిలీజ్​ చేసిన మేకర్స్​

సూపర్ హిట్ మూవీ నాంది తర్వాత నటుడు అల్లరి నరేష్ మూవీ స్క్రిప్ట్ సెలక్షన్ పూర్తిగా మారిపోయింది. నాంది సినిమా తరువాత నరేష్ కి సెకండ్ ఇన్నింగ్స్ మొదలైంది అని చెప్పవచ్చు. ఇప్పుడు చేసే ప్రతీ సినిమాలో.. కామెడీ హీరో అనే మార్క్ ను దాటి తాను కూడా వర్సటైల్ యాక్టర్ అని ప్రూవ్ చేసుకుంటున్నాడు నరేష్. కాగా, నాంది సినిమా తరువాత.. అదే మూవీ డైరెక్టర్ విజయ్ కనకమేడల యాక్షన్ థ్రిల్లర్ ఉగ్రం చిత్రం కోసం మళ్లీ జతకట్టారు.

ప్రస్తుతం షూటింగ్ దశలో ఉన్న ఈ సినిమా మరోసారి వార్తల్లో నిలిచింది. ఉగ్రమ్ ఏప్రిల్ 17, 2023న ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధంగా ఉంది అని.. సినిమా విడుదల తేదీని ప్రకటించడానికి ఇంటెన్స్ గ్లింప్స్‌ను విడుదల చేశారు మూవీ మేకర్స్. అల్లరి నరేష్ ఈ చిత్రంలో చాలా భయంకరంగా కనిపిస్తున్నారు. నరేష్ లుక్ కి సూపర్ రెస్పాన్స్ వస్తోంది. షైన్ స్క్రీన్స్ బ్యానర్‌పై సాహు గారపాటి, హరీష్ పెద్ది నిర్మిస్తున్న ఈ సినిమాలో మలయాళ నటి మర్నా కథానాయికగా నటిస్తుంది. నాందికి పనిచేసిన అదే సాంకేతిక బృందం ఉగ్రం చిత్రం కోసం పని చేస్తోంది. శ్రీచరణ్ పాకాల ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నారు.

YouTube video

Advertisement

తాజా వార్తలు

Advertisement