Friday, April 19, 2024

అలివేలు మంగ వెంకటరమణ సినిమా అప్డేట్ !!

తేజ దర్శకత్వంలో గోపీచంద్ హీరోగా అలివేలుమంగా వెంకటరమణ సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. అయితే ఈ సినిమాలో టైటిల్ ని బట్టి ఈ సినిమా మొత్తం రెండు పాత్రల చుట్టూ తిరుగుతుందని అర్థం అవుతుంది. కాగా ఇందులో హీరోయిన్ గా మొదట కాజల్ అగర్వాల్ ను అనుకున్నారు. కానీ డేట్స్ కుదరక పోవడంతో సాయి పల్లవి తో సంప్రదింపులు జరిపారు. అయితే సాయి పల్లవి కూడా సినిమాలతో బిజీగా ఉండటం వల్ల ఆమె డేట్స్ సర్దుబాటు కాలేదు.

దీంతో కీర్తి సురేష్ కొత్తగా లైన్ లోకి తీసుకు వచ్చారు. కాగా ఈ సినిమాను ఈ నెల నుంచి సెట్స్ పైకి తీసుకెళ్లాలని తేజ భావిస్తున్నారు. కానీ పరిస్థితులు అనుకూలించకపోవడంతో ఆగస్టు ఫస్ట్ వీక్ నుంచి రెగ్యులర్ షూటింగ్ మొదలు పెట్టాలని యూనిట్ డిసైడ్ అయ్యారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement