Wednesday, May 19, 2021

సీత వచ్చేస్తుంది… ఈ సీత…ఆ సీత కాదు !!

దర్శక ధీరుడు రాజమౌళి బాహుబలి సినిమా తర్వాత ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్న చిత్రం ఆర్ఆర్ఆర్. ఈ చిత్రంలో యంగ్ టైగర్ ఎన్టీఆర్ మెగా పవర్ స్టార్ రాంచరణ్ హీరోగా నటిస్తున్నారు. అల్లూరి సీతారామరాజు గా రామ్ చరణ్, కొమరం భీమ్ గా ఎన్టీఆర్ కనిపించనున్నారు. ఇప్పటికే ఈ ఇద్దరికీ సంబంధించిన వీడియోలను చిత్ర యూనిట్ రిలీజ్ చేసింది. ఈ రెండు వీడియోలు కూడా సినీ అభిమానులను విశేషంగా ఆకట్టుకున్నాయి. ఇక ఈ సినిమాలో బాలీవుడ్ స్టార్ నటుడు అజయ్ దేవగన్ కూడా నటిస్తున్నాడు.

మరోవైపు ఎన్టీఆర్ సరసన హాలీవుడ్ బ్యూటీ ఒలివియా మోరీస్, రామ్ చరణ్ సరసన బాలీవుడ్ బ్యూటీ అలియాభట్ నటిస్తున్నారు. ఇక అలియా భట్ ఈ సినిమాలో సీత గా కనిపించనున్నారు. కాగా అలియా భట్ కి సంబంధించిన లుక్ ను మార్చి 15న ఉదయం 11 గంటలకు రిలీజ్ చేయనున్నట్లు చిత్ర యూనిట్ అధికారికంగా ప్రకటించింది. ఈ మేరకు ఓ పోస్టర్ ను రిలీజ్ చేసింది.

Advertisement

తాజా వార్తలు

Prabha News