Friday, April 26, 2024

రక్షాబంధన్‌ సెట్ లో ప్రతి ఐదు రోజులకూ ఆర్‌టి-పీసీఆర్‌ టెస్టులు..!

కరోనా ఆంక్షలతో బాలీవుడ్ లో సినిమాల షూటింగ్ లు జరుగుతున్నాయి. అయితే నిర్మాతలు తగు జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ఎప్పటికప్పుడు కరోనా నిర్దారణ పరీక్షలు నిర్వహిస్తున్నారు. అక్షయ్ కుమార్ హీరోగా నటిస్తున్న రక్షాబంధన్‌ మూవీ సెట్ లో రెగ్యులర్ గా కరోనా పరీక్షలు నిర్వహిస్తున్నారు. చిత్రీకరణ ప్రారంభించడానికి ఇరవై నాలుగు గంటల ముందే చిత్రబృందంలో అందరికీ ఆర్‌టి-పీసీఆర్‌ టెస్టులు చేయిస్తున్నట్లు అక్షయ్ తెలిపారు. అంతేకాదు ప్రతి ఐదు రోజులకూ ఆ టెస్ట్‌లు రిపీట్‌ చేస్తున్నామని…సెట్‌లో ఎప్పుడూ ఓ డాక్టర్‌ ఉంటున్నారని ఆయన పేర్కొన్నారు. నటీనటులు మినహా మిగతా బృందమంతా మెడికల్‌ మాస్క్‌లు, ఫేస్‌ షీల్డులు ధరించడం తప్పనిసరి చేశాం. సెట్‌ అంతా తరచూ శానిటైజేషన్‌ చేస్తున్నాం’’ అని అక్షయ్‌కుమార్‌ వివరించారు. ఇటీవల ముంబైలో  ‘రక్షాబంధన్‌’ చిత్రీకరణ మొదలైన సంగతి తెలిసిందే. జాగ్రత్తలు తీసుకుంటూ పని చేస్తున్నామని ఆయన చెప్పుకొచ్చారు.

సూర్యవంశీ’, ‘బెల్‌ బాటమ్‌’, ‘అతరంగి రే’, ‘పృథ్వీరాజ్‌’, ‘రామ్‌ సేతు’, ‘బచ్చన్‌ పాండే’, ‘రక్షాబంధన్‌’, ‘ఓ మై గాడ్‌-2’ – ఇప్పుడు అక్షయ్‌ చేతిలో ఉన్న చిత్రాల జాబితా పెద్దదే. అందులో కొన్ని ఏడాది నుంచి విడుదల కోసం ఎదురు చూస్తున్నాయి. వీటి గురించి అక్షయ్‌కుమార్‌ మాట్లాడుతూ ‘‘నా సినిమాలన్నీ వెండితెరపై విడుదల కావాలని కోరుకుంటాను. కానీ, పరిస్థితులను బట్టి కొన్ని ఓటీటీలో విడుదలయ్యాయి. ‘సూర్యవంశీ’ కోసం ఏడాదిగా ఎదురు చూస్తున్నారంతా. గతేడాది కరోనా వల్ల వాయిదా పడింది. ఈ ఏడాది ఏప్రిల్‌లో విడుదల చేద్దామనుకుంటే కుదరలేదు. మూడోసారి అదృష్టం కలిసి వస్తుందని ఆశిస్తున్నా’’ అని అక్షయ్ అన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement