Saturday, April 20, 2024

జూలై 27న అక్ష‌య్‌కుమార్ ‘బెల్ బాటమ్’ విడుద‌ల

బాలీవుడ్ స్టార్ హీరో అక్ష‌య్‌కుమార్ హీరోగా న‌టిస్తోన్న చిత్రం ‘బెల్ బాటమ్’. వచ్చే నెలలో థియోటర్స్ తెరుచుకునె అవకాశం ఉండటంతో అక్ష‌య్ కుమార్ బెల్‌బాట‌మ్ సినిమా రిలీజ్ డేట్‌ను అనౌన్స్ చేశారు. ఈ ఏడాది జూలై 27న ‘బెల్ బాటమ్’ ను విడుద‌ల చేయ‌బోతున్న‌ట్లు అక్ష‌య్ తెలిపారు.  రంజిత్‌ ఎం.తివారీ దర్శకత్వంలో వషు భగ్నానీ, జాకీ భగ్నానీ, దీప్‌శిక్షా దేశ్‌ముఖ్‌, మోనిషా అద్వానీ, మధు బోజ్వానీ, నిఖిల్‌ అద్వానీ ఈ చిత్రాన్ని నిర్మించారు.

పాండమిక్‌ సమయంలో చిత్రీకరణను పూర్తి చేసుకున్నఈ చిత్రాన్ని ఏప్రిల్‌లో విడుద‌ల చేయాలుకున్నారు. అయితే కొవిడ్ సెకండ్ వేవ్ కార‌ణంగా సినిమా విడుద‌ల వాయిదా ప‌డింది. ఒకానొక సంద‌ర్భంలో ‘బెల్ బాటమ్’  ఓటీటీలో విడుద‌ల‌వుతుంద‌ని వార్త‌లు వ‌చ్చినా వాటిని నిర్మాత‌లు ఖండించారు. వాణీ కపూర్‌, లారాదత్తా, హూమాఖురేషి హీరోయిన్లుగా నటిస్తోన్న ఈ చిత్రం 1980 బ్యాక్‌డ్రాప్‌లో రూపొందింది. ఇందులో అక్షయ్‌ రా ఏజెంట్‌గా కనిపించనున్నారు. అక్ష‌య్ కుమార్ అండ్ టీమ్ తీసుకున్న డేరింగ్ డిసిష‌న్‌ను అంద‌రూ అప్రిషియేట్ చేస్తున్నారు.  

Advertisement

తాజా వార్తలు

Advertisement