Wednesday, March 27, 2024

ఆకాశం నీ హద్దురా రీమేక్ లో అక్షయ్ కుమార్ !!

సుధ కొంగర దర్శకత్వంలో తమిళ స్టార్ హీరో సూర్య ప్రధానపాత్రలో ప్రేక్షకుల ముందుకు వచ్చిన చిత్రం ఆకాశం నీ హద్దురా. ప్రముఖ ఓటీటీ సంస్థ అమెజాన్ ప్రైమ్ లో రిలీజ్ అయిన ఈ చిత్రం విమర్శకుల ప్రశంసలను సైతం అందుకుంది. అలాగే సినిమాలో అపర్ణ బాలమురళి హీరోయిన్ గా నటించింది. ఇదిలా ఉండగా ఈ సినిమాను హిందీలో రీమేక్ చేయబోతున్న సంగతి తెలిసిందే. కాగా మొదట సూర్య పాత్రలో హృతిక్ రోషన్ నటించబోతున్నాడు అంటూ వార్తలు వచ్చాయి. కానీ ఇప్పుడు తాజాగా మరో పేరు తెరపైకి వచ్చింది.

బాలీవుడ్ స్టార్ హీరో అక్షయ్ కుమార్ ఈ సినిమాలో హీరోగా కనిపించబోతున్నాడట. గతంలో అక్షయ్ కుమార్ చాలా సినిమాలను రీమేక్ చేశారు. ఇప్పుడు ఈ సినిమా కూడా చేయడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలుస్తోంది. త్వరలోనే ఇందుకు సంబంధించిన అధికారిక ప్రకటన కూడా రానుందట.

Advertisement

తాజా వార్తలు

Advertisement