Friday, March 29, 2024

వైల్డ్ డాగ్ ఆ రకమైన సినిమా కాదు…మెగా స్టార్

అహిసోర్ సోలమన్ దర్శకత్వంలో కింగ్ అక్కినేని నాగార్జున హీరోగా ప్రేక్షకుల ముందుకు వచ్చిన చిత్రం వైల్డ్ డాగ్. లాంగ్ గ్యాప్ తర్వాత ఈ సినిమాతో అక్కినేని నాగార్జున మంచి హిట్ ను అందుకున్నారు. కాగా ఈ సినిమాపై మెగా స్టార్ చిరంజీవి ట్విట్టర్ వేదికగా స్పందించారు. ఇప్పుడే వైల్డ్ డాగ్ సినిమా చూశాను. తెలుగు రాష్ట్రాలలో జరిగిన అతి దారుణమైన టెర్రరిస్ట్ ఘాతుకం వెనుకున్న ఆ ఆపరేషన్ నీ కళ్ళకు కట్టినట్టు చూపించారు. ఆ ఆవేశాన్ని ప్రాణాలకు తెగించి ఆ నీచుడిని వెంటాడి వేటాడిన మన రియల్ లైఫ్ హీరోస్ ని, ఆ రియల్ హీరోలను మరింత అద్భుతంగా చూపించిన నా సోదరుడు అక్కినేని నాగార్జునకు, దర్శకుడు సొలొమాన్ కు, నిర్మాత నిరంజన్ రెడ్డి కి మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను.

ఇది ప్రతి వారం విడుదలయ్యే చిత్రాలలో ఒకటి కాదు. ప్రతి ఒక్క భారతీయుడు తెలుగువారు గర్వంగా చూడవలసిన చిత్రం అంటూ చిరంజీవి ట్వీట్ చేశారు. అయితే చిరంజీవి చేసిన ట్వీట్ కు వైల్డ్ డాగ్ యూనిట్ స్పెషల్ థాంక్స్ చెబుతూ ఓ పోస్టర్ ని రిలీజ్ చేసింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement