Thursday, April 18, 2024

‘ఏజెంట్’ గా అఖిల్

అక్కినేని అఖిల్ పుట్టినరోజు సందర్భంగా ఐదో చిత్రానికి సంబంధించిన టైటిల్ ఫస్ట్ లుక్ ను చిత్ర యూనిట్ రిలీజ్ చేసింది. సురేందర్ రెడ్డి దర్శకత్వంలో ఏ కే ఎంటర్టైన్మెంట్ బ్యానర్ పై ఈ సినిమా తెరకెక్కుతోంది. కాగా ఈ సినిమాకు ఏజెంట్ అనే టైటిల్ ని పెట్టారు. వక్కంతం వంశీ ఈ సినిమాకు కథను అందిస్తన్నారు.

కాగా గతంలో సురేందర్ రెడ్డి, వక్కంతం కాంబినేషన్లో కిక్ రేసుగుర్రం వంటి సూపర్ డూపర్ హిట్స్ రావడం ఇప్పుడు అఖిల్ సినిమా పై భారీ అంచనాలు నెలకొంటున్నాయి. ఇక ఈ లుక్ లో పెరిగిన జుట్టు, గడ్డం చేతిలో సిగరెట్ తో అఖిల్ మాస్ యాటిట్యూడ్ లో కనిపించాడు. ఇక ఈ సినిమాలో అఖిల్ సరసన సాక్షి వైద్య హీరోయిన్ గా నటిస్తోంది.

ఎస్ ఎస్ థమన్ సంగీతం అందిస్తున్న ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ ఈ నెల 11 నుంచి ప్రారంభం కానుంది. అంతేకాకుండా ఈ ఏడాది డిసెంబర్ 24న ఏజెంట్ ను థియేటర్లోకి తీసుకొస్తామని కూడా యూనిట్ అనౌన్స్ చేయటం విశేషం.

Advertisement

తాజా వార్తలు

Advertisement