Tuesday, March 26, 2024

దుల్కర్ సల్మాన్ దర్శకుడితో అఖిల్ కొత్త సినిమా ?

అందాల రాక్షసి, కృష్ణ గాడి వీర ప్రేమగాథ, లై, పడి పడి లేచే మనసు వంటి చిత్రాలతో దర్శకుడిగా మంచి పేరు తెచ్చుకున్నాడు హను రాఘవపూడి. అయితే ప్రస్తుతం హను రాఘవపూడి దుల్కర్ సల్మాన్ హీరోగా సినిమా తెరకెక్కిస్తున్నాడు. ఈ సినిమాకు లెఫ్ట్నెంట్ రామ్ అనే టైటిల్ ని ఫిక్స్ చేశారు. ఈ సినిమాను తెలుగు, తమిళ మలయాళ భాషల్లో తెరకెక్కిస్తున్నారు.

ఇదిలా ఉండగా ఈ సినిమా సెట్స్ పై ఉండగానే మరో సినిమా లైన్ లో పెట్టాడు రాఘవపూడి. అక్కినేని అఖిల్ తో ఓ సినిమా చేయబోతున్నాడట. ఇప్పటికే అఖిల్ కు స్టోరీ చెప్పాడని…అఖిల్ కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడని తెలుస్తోంది. అఖిల్ ప్రస్తుతం మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ సినిమా విడుదలకు సిద్ధంగా ఉంది. అలాగే సురేందర్ రెడ్డి దర్శకత్వంలో ఏజెంట్ సినిమా లో నటిస్తున్నాడు.

Advertisement

తాజా వార్తలు

Advertisement