Friday, April 19, 2024

వికారాబాద్ అడవుల్లో ‘అఖండ’

బోయపాటి శ్రీను దర్శకత్వంలో నందమూరి బాలకృష్ణ హీరోగా తెరకెక్కుతున్న చిత్రం అఖండ. భారీ అంచనాల మధ్య తెరకెక్కుతున్న ఈ చిత్రంలో బాలకృష్ణ ద్విపాత్రాభినయం చేస్తున్నాడు. ఇప్పటికే అఖండ గెటప్ కు సంబంధించిన లుక్, టీజర్ ను చిత్ర యూనిట్ రిలీజ్ చేసింది. ఆ టీజర్ కు ప్రేక్షకుల నుండి విశేష స్పందన లభించింది. ఇక ఇప్పటికే 17 మిలియన్ల వ్యూస్ ని కూడా సాధించింది. తాజాగా అఖండ చిత్ర యూనిట్ వికారాబాద్ అడవుల్లో షూటింగ్ జరుపుకుంటోంది.

వికారాబాద్ అడవుల్లో బాలయ్య శ్రీకాంత్ మధ్య యాక్షన్ సన్నివేశాలను చిత్రీకరిస్తున్నట్లు తెలుస్తోంది. గతంలో లెజెండ్ చిత్రంతో జగపతిబాబు ను విలన్ గా చూపించిన బోయపాటి ఈ సినిమా లో శ్రీకాంత్ ను విలన్ గా చూపించనున్నారు. అలాగే అఖండ సినిమాలో పూర్ణ, ప్రగ్యా జైస్వాల్ హీరోయిన్స్ గా నటిస్తున్నారు. మే 28న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement