Thursday, April 25, 2024

అఖండ రీస్టార్ట్ అయింది…అఘోర కూడా వచ్చేశాడు!!

యాక్షన్ డైరెక్టర్ బోయపాటి శ్రీను దర్శకత్వంలో నందమూరి బాలకృష్ణ హీరోగా తెరకెక్కుతున్న చిత్రం అఖండ. భారీ అంచనాల మధ్య తెరకెక్కుతున్న ఈ సినిమాలో బాలకృష్ణ సరసన పూర్ణ, ప్రగ్యా జైస్వాల్ హీరోయిన్స్ గా నటిస్తున్నారు. ఇక కరోనా కారణంగా వాయిదా పడ్డ ఈ సినిమా షూటింగ్ నేడు రీ స్టార్ట్ అయింది. ఈ షెడ్యూల్ లో బాలకృష్ణ పై కొన్ని కీలక సన్నివేశాలను షూట్ చేస్తున్నారు.

ఇక ఈ సినిమాలో బాలయ్య అఘోర గా నటించబోతున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించి విడుదలైన టీజర్ అభిమానులను ఆకట్టుకుంది. ద్వారక క్రియేషన్స్ బ్యానర్ పై మిరియాల రవీందర్ రెడ్డి నిర్మిస్తున్న ఈ సినిమాకు తమన్ సంగీతం అందిస్తున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement