Thursday, April 25, 2024

అఖండ అప్డేట్స్…ఒకే సారి రెండు?

నందమూరి బాలకృష్ణ హీరోగా బోయపాటి శ్రీను దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం అఖండ. భారీ అంచనాల మధ్య తెరకెక్కుతున్న ఈ చిత్రంలో బాలయ్య సరసన ప్రగ్యా జైస్వాల్, పూర్ణ హీరోయిన్స్ గా నటిస్తున్నారు. అలాగే బాలయ్య ద్విపాత్రాభినయం చేస్తున్నారు. ఇక ఇప్పటికే విడుదల అయిన టీజర్ ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంది.

అయితే ఇప్పుడు ఫ్యాన్స్ అందరూ కూడా ఫస్ట్ సింగిల్ కోసం ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. కాగా తాజా సమాచారం ప్రకారం… దీనిని అతి త్వరలోనే విడుదల చేయనున్నారని సమాచారం. అదే రోజు మరో అప్డేట్ కూడా ఇవ్వనున్నారట. అదే అఖండ రిలీజ్ డేట్ అని తెలుస్తుంది. ఈ రిలీజ్ డేట్ ఎప్పుడు ఉంటుంది అన్న దానిపై ఫ్యాన్స్ లో ఆసక్తి నెలకొంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement