Thursday, April 18, 2024

వీడియో వైరల్: ఆటోలో ప్రయాణించిన అజిత్

కోలీవుడ్ టాప్ హీరో అజిత్ కుమార్ తన అభిమానులను ఎప్పటికప్పుడు ఇన్‌స్పైర్ చేస్తూనే ఉంటాడు. ఇండస్ట్రీలో గాడ్ ఫాదర్ ఎవరూ లేకుండా సూపర్ స్టార్‌గా ఎదిగిన ఆయన.. సింప్లిసిటీ, హానెస్టీకి కేరాఫ్ అడ్రస్‌. సెలబ్రిటీ స్టేటస్‌లో ఉండి కూడా తమిళనాడు స్టేట్ షూటింగ్ ఛాంపియన్‌షిప్‌లో పాల్గొని ఎనిమిది మెడల్స్ సాధించిన అజిత్.. ఇప్పుడు ఆటోలో ప్రయాణించి మరోసారి తన సింప్లిసిటీని నిరూపించుకున్నాడు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ కాగా.. ‘మ్యాన్ ఆఫ్ సింప్లిసిటీ’ అని ఎందుకు అంటారో ఇప్పుడు అర్థమవుతుందా? అంటూ ఆ వీడియోను షేర్ చేస్తున్నారు ఫ్యాన్స్. ఇక అజిత్ ‘వాలిమై’ షూటింగ్ పూర్తి చేసే పనిలో ఉండగా, స్పెయిన్‌లో ఆఖరి షెడ్యూల్‌తో సినిమా పూర్తి కానుంది. హెచ్ వినోద్ దర్శకత్వంలో వస్తున్న ఈ చిత్రాన్ని బోనీకపూర్ నిర్మిస్తున్నాడు.

Advertisement

తాజా వార్తలు

Advertisement