Monday, April 22, 2024

ఆక‌ట్టుకునే షోలు, కొత్త కొత్త సినిమాలు.. ఆహా అనిపిస్తున్న తెలుగు ఓటీటీ!

తెలుగు ఓటిటి ప్లాట్‌ఫారమ్ ఆహా.. తమ సబ్ స్క్రైబర్ లను అలరించడానికి సాధ్యమయ్యే ప్రతి మార్గాన్ని కనుగొంటున్నట్లు కనిపిస్తోంది. వినియోగదారులను ఆకర్షించడానికి.. ఎన్నో ప్రయత్నాలు చేస్తూనే ఉంది. అందులో భాగంగానే ఇంగ్లీష్ సినిమాలతో పాటు కొరియన్ సిరీస్‌లను తెలుగులో డబ్ చేస్తూ ప్రేక్షకులను అలరిస్తోంది. అంతే కాకుండా, ఆహా వీడియో యూజర్స్ ని అలరించడానికి ఒక ప్రముఖ సెలబ్రిటీ టాక్ షో అయిన అన్‌స్టాపబుల్‌ విత్ NBKతో పాటు మంచు లక్షి ఆహా భోజనంబు, సమంతతో సామ్ జాబ్ వంటి షోలను కూడా ప్రవేశపెట్టింది.

అయితే.. ఇప్పుడు జనవరి, ఫిబ్రవరి నెలలో విడుదల కానున్న మూడు సినిమాల డిజిటల్ స్ట్రీమింగ్ హక్కులను కొనుగోలు చేసినట్లు ప్రకటించింది ఆహా. సందీప్ కిషన్ ‘మైఖేల్’, కిరణ్ అబ్బవరం ‘వినరో భాగ్యము విష్ణు కథ’ & సంతోష్ శోభన్ ‘కళ్యాణం కమనీయం’ సినిమాల డిజిటల్ హక్కులను పొందినట్లు ఓటిటి ప్లాట్‌ఫారమ్ ఆహా అధికారికంగా వెల్లడించింది. వీటితో పాటుగా అనేక సినిమాలు, సిరీస్‌లను ప్రకటించింది. స్ట్రీమింగ్ తేదీలు, ఇతర వివరాలు రాబోయే రోజుల్లో తెలియ‌జేస్తామ‌ని తెలిపింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement