Friday, April 19, 2024

‘ఐకాన్’ ఈసారి కనిపించేలా ఉన్నాడు!!

వకీల్ సాబ్ సినిమాతో తానేంటో నిరూపించుకున్నాడు దర్శకుడు వేణు శ్రీరామ్. ఈ సినిమాలో పవన్ కళ్యాణ్ ను చూపించిన విధానానికి వేణు శ్రీరామ్ కు వందకి వంద మార్కులు వేస్తున్నారు విశ్లేషకులు. కాగా అల్లు అర్జున్ తో గతంలో ఐకాన్ కనబడుట లేదు అనే సినిమాను ఎనౌన్స్ చేశాడు వేణు. కానీ అది అక్కడితో ఆగిపోయింది. కాగా ఇప్పుడు వకీల్ సాబ్ హిట్ తో మళ్లీ ఈ సినిమా పేరు తెరపైకి వచ్చింది.

నిజానికి ఐకాన్ చిత్రాన్ని శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై దిల్ రాజు నిర్మించాల్సి ఉంది. అయితే ఈ సినిమాని పక్కన పెట్టి బన్నీ అలా వైకుంఠపురములో సినిమాని పూర్తి చేశాడు. ఆ తర్వాత పుష్ప సినిమా చేస్తున్నాడు. కాగా అప్పుడు వకీల్ సాబ్ బిజీలో వేణు శ్రీరామ్ కూడా ఉన్నారు.

ఇక ఎట్టకేలకు ఇప్పుడు మళ్ళీ ఐకాన్ పేరు వినిపిస్తోంది. పుష్ప సినిమా లేట్ అవుతుండటంతో కొరటాల ఎన్టీఆర్ తో సినిమాకి రెడీ అవుతున్నాడు. ఈ నేపథ్యంలో పుష్ప తరువాత అల్లు అర్జున్ ఐకాన్ సినిమాని చేయబోతున్నాడని అంటున్నారు. ఇక ఇప్పటికే ఐకాన్ స్టార్ గా పేరు పెట్టుకున్న అల్లు అర్జున్ ఆ టైటిల్ తో కూడా ఓ సినిమా చేయాలని అభిమానులు కోరుకుంటున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement