Thursday, April 25, 2024

‘నాంది’ తర్వాత.. విజయ్ కనకమేడలతో అల్లరి నరేష్ మూవీ!

విజయ్ కనకమేడల, అల్లరి నరేష్ కాంబోలో గ‌త ఏడాది ఫిబ్ర‌వ‌రీలో వ‌చ్చిన క్రైమ్ త్రిల్ల‌ర్ సినిమా నాంది.. గంభీరమైన పాత్రలను కూడా సూనాయ‌సంగా చేయ‌గ‌ల‌డు అని నిరూపించాడు కామెడీ కింగ్ అల్ల‌రి న‌రేష్. అయితే.. ఈ బ్లాక్ బ‌స్ట‌ర్ కాంబో మ‌ళ్లీ రిపీట్ కానుంది.. నటుడు అల్లరి నరేష్, దర్శకుడు విజయ్ కనకమేడల మళ్లీ కలిసి పని చేయనున్నారు.

వీరి కాంబినేషన్​లో కొత్త సినిమా ‘నరేష్ విజయ్ 2’ వర్కింగ్ టైటిల్‌తో ఈ రోజు (సోమవారం) లాంఛనంగా ఆవిష్కరించారు. కృష్ణార్జున యుద్ధం’, ‘మజిలీ’, ‘గాలి సంపత్‌’, ‘టక్‌ జగదీష్‌’ వంటి పలు ఆసక్తికర ప్రాజెక్టులకు పనిచేసిన షైన్‌ స్క్రీన్స్‌ పతాకంపై సాహు గారపాటి, హరీష్‌ పెద్ది ఈ చిత్రాన్ని నిర్మించనున్నారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి.

Advertisement

తాజా వార్తలు

Advertisement