Thursday, April 25, 2024

న‌గ్మాతో ఎఫైర్.. స్పందించిన న‌టుడు ర‌వికిష‌న్

భోజ్ పురి న‌టుడు ర‌వికిష‌న్ తెలుగువారికి ప‌రిచ‌య‌మే.. రేసుగుర్రం చిత్రంతో తెలుగులోకి ఎంట్రీ ఇచ్చారు ర‌వికిష‌న్. ఆగ‌డు.. కిక్ 2.. బ్రూస్ లీ, సుప్రీమ్,రాధ‌..లై..ఎంఎల్ ఏ..సాక్ష్యం..ఎన్టీఆర్ క‌థానాయ‌కుడు.. సైరా..గ‌ద్ద‌ల‌కొండ గ‌ణేశ్.. హీరో వంటి చిత్రాల్లో నటించారు. హిందీ, భోజ్‌పూరీతోపాటు తెలుగు, తమిళం, కన్నడ, మలయాళంలోనూ నటించి మెప్పిస్తున్నాడు. ఇదిలా ఉంటే ఆయన రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చారు. గత సార్వత్రిక ఎన్నికల్లో ఆయన లోక్ సభ ఎంపీగా ఉత్తర ప్రదేశ్‌ లోని గోరక్‌పూర్‌ నియోజకవర్గం నుంచి గెలుపొందారు.కాగా ఆయ‌న భోజ్ పురిలో హీరోగా రాణించే క్రమంలో ఎక్కువగా హీరోయిన్ నగ్మాతో సినిమాలు చేశారు ర‌వికిష‌న్. ఈ క్రమంలో వీరిద్దరి మధ్య లవ్‌ ఎఫైర్‌ ఉందనే పూకార్లు ఊపందుకున్నాయి. అప్పట్లో అవి హాట్‌ టాపిక్‌గా మారాయి. ఈ నేపథ్యంలో తాజాగా దీనిపై నటుడు రవికిషన్‌ స్పందించారు.

ఓ ఇంటర్వ్యూలో ఈ విషయాలపై ఓపెన్‌ అయ్యారు. నగ్మాతో కలిసి ఎక్కువ సినిమాలు చేయడం వల్లే ఇలాంటి రూమర్లు వచ్చాయని తెలిపారు. ఆమెతో కలిసి నటించిన సినిమాలు చాలా వరకు పెద్ద హిట్‌ అయ్యాయి. పైగా తామిద్దరం మంచి స్నేహితులమని, దీని కారణంగానే ఎక్కువ సినిమాలు చేశామని తెలిపారు రవికిషన్‌. అప్పటికే నాకు పెళ్లి అయ్యింది. నా భార్య ప్రీతి శుక్లాని నేను చాలా గౌరవిస్తా. నేను ఆమె పాదాలకు నమస్కరిస్తా, నా భార్య మొదట్నుంచి నాతో ఉంది. నా వద్ద డబ్బులు లేనప్పుడు కూడా ఆమె నాతోనే ఉంది. కానీ వరుసగా నా సినిమాలు హిట్‌ కావడంతో నేను చాలా గర్వంగా ప్రదర్శించా, ఆ సమయంలో నన్ను బిగ్‌ బాస్‌ షోకి వెళ్లమని నా భార్య సూచించింది. మొదట ఇష్టం లేకపోయినా తర్వాత వెళ్లాను. మూడు నెలల పాటు హౌజ్‌లో ఉండటంతో నాలో చాలా మార్పు వచ్చింది. ఈ షో ద్వారా నేను పాపులర్ కావడమే కాదు, వ్యక్తిగా చాలా మారిపోయా, సాధారణ వ్యక్తిగా మారాను. ఆ తర్వాత నా కుటుంబాన్ని, నాభార్య పిల్లలను బాగా చూసుకున్నా అని తెలిపాడు రవికిషన్‌.

Advertisement

తాజా వార్తలు

Advertisement