Thursday, March 28, 2024

HIT -3 న‌టీ న‌టులు వీళ్లేనా?.. Hit-2 మూవీ ఎండింగ్​లో పార్ట్​‌3 గ్లింప్స్ ఉంటుందట!

HIT ఫస్ట్ కేస్ మూవీ మంచి హిట్‌గా ముగిసింది.. ఇప్పుడు సెకెండ్ కేస్ HIT-2 పేరుతో రిలీజ్ కి రెడీగా ఉంది. అయితే ఈ క్రైమ్ థ్రిల్లర్‌ యూనివర్స్ లో న‌టుడు విశ్వక్ సేన్ స్థానంలో స్పై థ్రిల్ల‌ర్ మూవీస్‌తో అల‌రిస్తున్న మ‌రో న‌టుడు అడివి శేష్ వచ్చాడు. ఇక ఇప్పుడు HIT-2 షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. రిసెంట్ గా రిలీజ్ అయిన టీజర్ తో అభిమానుల‌కు ఈ సినిమాపై అంచనాలు పీక్స్ లో ఉన్నాయి. మూవీ నుంచి రిలీజ్ అయిన సాంగ్స్ కూడా యూట్బూలో ట్రెండ్ అవుతూనే ఉన్నాయి.

శైలేష్ కొలను దర్శకత్వంలో తెరకెత్తున్న ఈ క్రైమ్ థ్రిల్లర్ సినిమాటిక్ యూనివర్స్ కి సంబందించిన వార్త ఒకటి సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఈ క్రైమ్ థ్రిల్లర్ యూనివర్స్ పార్ట్ 3 లో తమిళ‌ స్టార్ యాక్టర్ విజయ్ సేతుపతి, నేచురల్ స్టార్ నాని, థ్రిల్లింగ్ స్టార్ అడివి శేష్‌ ముఖ్యమైన పాత్రల్లో కనిపించనున్న్టుట తెలుస్తోంది. ఇక ఈ పార్ట్ అమెరికా బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కనున్నట్టు సినీ వ‌ర్గాల‌ స‌మాచారం. అంతేకాదు వచ్చే నెల (డిసెంబర్) 2న రిలీజ్ అవుతున్న Hit 2 మూవీ క్లైమాక్స్ లో 3వ కేస్ గ్లింప్స్ యాడ్ చేయనున్నట్టు తెలుస్తోంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement