Thursday, March 28, 2024

శ్రీరామ నవమికి ‘ఆదిపురుష్’ స్పెషల్ ట్రీట్ ?

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ వరుస పాన్ ఇండియా సినిమాలను లైన్ లో పెడుతున్నాడు.ప్రస్తుతం ఓం రౌత్ దర్శకత్వంలో ఆది పురుష్ సినిమాతో పాటు ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో సలార్ సినిమా చేస్తున్నాడు. ఇక ఆదిపురుష్ సినిమాలో ప్రభాస్ రాముడు గా కనిపించనున్నాడు. అలాగే సీత గా కృతి శెట్టి కనిపించనుంది.

ఇదిలావుండగా ఈ చిత్రానికి సంబంధించి ఓ వార్త సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. శ్రీరామనవమి రోజు ఈ సినిమాకు సంబంధించిన ఓ అప్డేట్ రనుందట. మొదట ప్రభాస్ లుక్ రాబోతుందని అందరూ అనుకున్నారు. కానీ ఇప్పుడు ఓ స్పెషల్ ట్రీట్ ఉంటుందని తెలుస్తుంది. అయితే ఆ ట్రీట్ ఏంటో తెలియాలంటే మాత్రం కొన్ని రోజులు వెయిట్ చేయాల్సిందే. ఇక ఈ సినిమాలో బాలీవుడ్ స్టార్ నటుడు సైఫ్ అలీ ఖాన్ లంకేష్ పాత్రలో కనిపించబోతుంది సంగతి తెలిసిందే.

Advertisement

తాజా వార్తలు

Advertisement