Thursday, April 18, 2024

Adipurush – అంద‌ర్ని అల‌రిస్తున్న రాం సీతా రాం సాంగ్ (వీడియోతో)

YouTube video

రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా ఓం రౌత్‌ దర్శకత్వంలో వస్తోన్న భారీ పాన్ ఇండియా సినిమా “ఆదిపురుష్”. మైథలాజికల్‌ డ్రామాగా ఈ సినిమా తెరకెక్కుతుంది. జూన్ 16న విడుదల కానున్న ఈ చిత్రంపై ప్రపంచ వ్యాప్తంగా భారీ అంచనాలున్నాయి. తాజాగా ఈ సినిమా నుంచి ‘రాం సీతా రాం వీడియో పాటను విడుదల అయింది. ‘నువ్వు రాజకుమారివి జానకి.. నువ్వు ఉండాల్సిది రాజభవనంలో’ అని సీత పాత్రధారి కృతీ సనన్‌కు ప్రభాస్ చెబితే.. ‘నా రాఘవ ఎక్కడుంటే అదే నా రాజమందిరం.. మీ నీడైనా మిమ్మల్ని వదిలివెళ్తుందేమో.. ఈ జానకి వెళ్లదు’ అని ఆమె సమాధానంగా చెబుతుంది.
‘ఆదియు అంతము రాముడిలోనే.. మా అనుబంధం రాముడితోనే’ అంటూ మొదలైన పాటలో రామజోగయ్య శాస్త్రి అందించిన సాహిత్యం చాలా బాగుంది. అలాగే పాటలో విజువల్స్ కూడా చాలా బాగా ఆకట్టుకున్నాయి. రామాయణం ఆధారంగా తెరకెక్కుతున్న ఈ చిత్రంలో కృతి సనన్ సీత పాత్ర పోషించింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement