Sunday, July 25, 2021

ముంబైలోనే ఆదిపురుష్ షూటింగ్ !!

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం సలార్ సినిమాతో పాటు ఆదిపురుష్ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఓం రౌత్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో ప్రభాస్ రాముడిగా కనిపించబోతున్నాడు. అలాగే సీతగా కృతిసనన్ కనిపించబోతోంది. మరోవైపు బాలీవుడ్ స్టార్ హీరో సైఫ్ అలీ ఖాన్ రావణాసురుడి గా కనిపించబోతున్నాడు. అలాగే భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్న ఈ సినిమా సెకండ్ షెడ్యూల్ కరోనా కారణంగా వాయిదా పడింది. కాగా ఈ సినిమా షెడ్యూల్ ను ముంబై నుంచి హైదరాబాద్ కు షిఫ్ట్ చేస్తున్నట్లుగా ఆ మధ్య వార్తలు వచ్చాయి.

కాగా తాజా సమాచారం ప్రకారం ఈనెల ద్వితీయార్థం లో ముంబైలో నెక్స్ట్ షెడ్యూల్ ను స్టార్ చేయబోతున్నారట దర్శకనిర్మాతలు. ఇప్పటికే బాలీవుడ్ లో కొన్ని రెగ్యులర్ సినిమా షూటింగ్ మొదలయ్యాయి. ఆ క్రమంలోనే ఆది పురుషుష్ కూడా మొదలు పెడుతున్నారని తెలుస్తోంది. హైదరాబాద్ కంటే ముంబై లోనే వ్యాక్సినేషన్ కార్యక్రమం స్పీడ్ గా సాగుతుందని… కాబట్టి అదే సేఫ్ ప్లేస్ అని భావిస్తుందట యూనిట్.

Advertisement

తాజా వార్తలు

Advertisement
Prabha News