Thursday, March 28, 2024

‘ఆదిపురుష్’ లేటెస్ట్ అప్డేట్.. జై శ్రీ రామ్ ఫుల్ సాంగ్ రిలీజ్ డేట్ ప్ర‌క‌టించిన మేక‌ర్స్

రీసెంట్ గానే ఆదిపురుష్ మూవీ నుంచి థియేట్రికల్ ట్రైలర్ రిలీజ్ చేశారు మేకర్స్. ఈ వీడియోతో సినిమాపై ఉన్న నెగిటివిటీ ఒక్క దెబ్బ‌తో తొలగిపోయింది. భారతీయ ఇతిహాసం రామాయణం ఆధారంగా ప్రభాస్ నటించిన ఈ సినిమాకి తాన్హాజీ: ది అన్‌సంగ్ వారియర్ ఫేమ్ ఓం రౌత్ దర్శకత్వం వహించారు. కాగా, ఈ పౌరాణిక నాటకం జూన్ 16న గ్రాండ్‌గా రిలీజ్ కానుంది.

ఈ సంద‌ర్భంగా ఇక రిలీజ్ చేసిన‌ ట్రైలర్‌లో ఉన్న జై శ్రీ రామ్ ట్రాక్ అందరినీ విశేషంగా ఆకట్టుకుంది. రిలీజ్ డేట్ దగ్గర పడుతుండటంతో ప్రమోషన్స్ ని ముమ్మరం చేయాలని మేకర్స్ నిర్ణయించుకున్నారు. కాగా, తాజాగా.. ఈ ట్రాక్ ఫుల్ సాంగ్ ని మే 20న రిలీజ్ చేయ‌నున్న‌ట్టు ప్ర‌క‌టించారు మేక‌ర్స్.

Advertisement

తాజా వార్తలు

Advertisement