Tuesday, April 13, 2021

ఆదిపురుష్ కి అభిమానులు ఏ స్థాయిలో ఉన్నారో చూశారా ?

మాములుగా సినీ హీరోలకు అభిమానులు ఉండటం కామన్. కానీ తాము పనిచేసే సినిమాపై ప్రేమ పెంచుకునే వ్యక్తులు తక్కువ. అయితే యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా ఓం రౌత్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా ఆదిపురుష్. రామాయణం ఆధారంగా తెరకెక్కుతున్న ఈ సినిమాలో ప్రభాస్ రాముడిగా కనిపించనున్నాడు. అలాగే సీత గా కృతి సనన్ నటిస్తుంది. మరోవైపు సైఫ్ అలీఖాన్ రావణ పాత్రలో కనిపిస్తున్నాడు.

అయితే ఇదిలా ఉండగా ఈ సినిమాకు పనిచేసే ఓ వ్యక్తి తన బుగ్గ మీద,తల వెనుక భాగంలోను A సింబల్ వచ్చేలా హెయిర్ కట్ చేయించాడు. ఆ ఫోటోలను దర్శకుడు ఓం రౌత్ సోషల్ మీడియా లో పోస్ట్ చేశాడు. ఇలాంటి కమిట్ మెంట్ ఉన్న వ్యక్తులతో వర్క్ చేయడం ఆనందంగా ఉందని చెప్పుకొచ్చాడు. ఇక ఫోటోలో ఉన్న వ్యక్తిని పరిశీలిస్తే మెడలో ఉన్న టాగ్ ను బట్టి ప్రొడక్షన్ బాయ్ అని అర్ధం అవుతుంది.

Advertisement

తాజా వార్తలు

Prabha News