Wednesday, April 17, 2024

‘ఆదిపురుష్’ 50 డేస్ సెలబ్రేషన్స్

బాలీవుడ్ డైరెక్టర్ ఓం రౌత్ దర్శకత్వంలో యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా తెరకెక్కుతున్న చిత్రం ఆదిపురుష్. రామాయణం ఆధారంగా తెరకెక్కుతున్న ఈ సినిమాలో ప్రభాస్ సరసన కృతి సనన్ హీరోయిన్ గా నటిస్తోంది. ఇందులో ప్రభాస్ రాముడు గా కనిపిస్తుండగా… సీతగా కృతిసనన్ కనిపించనుంది. అలాగే రావణాసురుడిగా సైఫ్ అలీ ఖాన్ కనిపించబోతున్నాడు. అయితే చిత్ర యూనిట్ ఇప్పుడు 50 రోజుల వేడుకను జరుపుకుంటుంది.

రిలీజ్ కాకుండా 50 రోజుల వేడుక ఏంటి అని అనుకుంటున్నారా!! ఈ సినిమా షూటింగ్ స్టార్ట్ చేసి 50 రోజులు పాటు విజయవంతంగా కంప్లీట్ చేసుకున్నందుకు ఈ వేడుకలు చేసుకుంటున్నారట. ఇదే విషయంపై ఓ ఫ్లెక్స్ ను కొట్టుకొని మరి సెలబ్రేట్ చేసుకుంటున్నారు చిత్రయూనిట్. ఇక అందుకు సంబంధించిన ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

Advertisement

తాజా వార్తలు

Advertisement