Friday, April 26, 2024

అధిగారం… రాఘవ లారెన్స్ పాన్ ఇండియా సినిమా

ఇటీవల కాలంలో సౌత్ లో తెరకెక్కుతున్న ప్రతి సినిమా కూడా పాన్ ఇండియా చిత్రంగా తెరకెక్కుతోంది. అంతేకాకుండా తొందరలో బాలీవుడ్ మార్కెట్ ని సౌత్ సినిమాలు బీట్ చేస్తాయనటం లో సందేహం లేదని కూడా చెబుతున్నారు విశ్లేషకులు. ఇదిలా ఉండగా కాంచన సినిమాకు సీక్వెల్ గా వరుస సినిమాలు చేస్తూ అటు తెలుగు తమిళ్ లో మంచి పేరు సంపాదించుకున్నాడు డాన్స్ మాస్టర్ రాఘవ లారెన్స్. అయితే ఈ సినిమాను హిందీలో కూడా రీమేక్ చేసి సూపర్ హిట్ సాధించాడు.

కాగా తాజాగా లారెన్స్ పాన్ ఇండియా సినిమా ప్రకటించాడు. అధిగారం పేరిట ఈ సినిమా తెరకెక్కబోతుంది అని అధికారికంగా ప్రకటించాడు. ఈ సినిమాకు సెంథిల్ కుమార్ దర్శకత్వం వహిస్తున్నాడు. అలాగే ఫైవ్ స్టార్ కథిరిసన్ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement