Saturday, July 24, 2021

‘అమరన్’ పోలీస్ స్టేషన్ లో ఆది సాయికుమార్

ఆది సాయి కుమార్ కెరీర్ ను ప్రారంభించి చాలా సంవత్సరాలు అవుతున్నాం.. సరైన హిట్ మాత్రం అందుకోలేకపోయాడు. ప్రస్తుతం హిట్ ప్లాపులతో సంబంధం లేకుండా వరుస సినిమాలను లైన్ లో పెడుతున్నాడు అది సాయి కుమార్. అయితే తాజాగా కొత్త సినిమా అమరన్ షూటింగ్ స్టార్ట్ చేశాడు. ఇటీవలే ఈ సినిమాకు సంబంధించిన పూజా కార్యక్రమాలు జరగగా… ఈ సినిమాలో ఒక పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్ పాత్రలో కనిపించబోతున్నాడు ఆది. ఇక ఈ సినిమాకు సంబంధించి పోలీస్ స్టేషన్ లో ఉండే సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారు.

హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లోనే ఈ సినిమా షూటింగ్ జరుగుతోంది. ఇక ఈ సినిమాకు బాల వీర్ దర్శకత్వం వహిస్తున్నాడు. అలాగే అవికాగోర్ హీరోయిన్ గా నటిస్తోంది. ఇక నటుడు సాయికుమార్ కూడా ఈ సినిమాలో కీలక పాత్ర పోషిస్తున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement
Prabha News