Wednesday, April 14, 2021

సన్నబడడానికి కారణం చెబుతూ ఎమోషనల్ – విద్యుల్లేఖ

నటి విద్యుల్లేఖ గురించి కొత్తగా పరిచయం అవసరం లేదు. తెలుగు తమిళ భాషల్లో అనేక సినిమాలలో నటించి మంచి పేరు తెచ్చుకుంది విద్యుల్లేఖ. ముఖ్యంగా స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా బోయపాటి శ్రీను దర్శకత్వంలో వచ్చిన సరైనోడు చిత్రంలో అల్లు అర్జున్ వదినగా నటిస్తూ తన కామెడీ టైమింగ్ తో ప్రేక్షకులను ఆకట్టుకుంది. అలాగే రన్ రాజా రన్, నిన్ను కోరి, రాజుగారిగది, దువ్వాడ జగన్నాథం వంటి సినిమాల్లో నటించి మంచి పేరు తెచ్చుకుంది.

అయితే నిజానికి ఇండస్ట్రీలో లేడీ కమెడియన్స్ తక్కువనే చెప్పాలి. మామూలుగా లేడి కమెడియన్స్ అంటే లావుగా అందవికారంగా ఉంటే కమెడియన్స్ గా సెట్ అవుతారనేది ముందు నుంచి ప్రేక్షకులకు అలవాటైంది. కానీ టైమింగ్ ఉంటే స్టార్ కమెడియన్ అవ్వచ్చు అని విద్యుల్లేఖ నిరూపించింది. అయితే అలా అలా లావు పెరుగుతున్న విద్యుల్లేఖ ఒక్కసారిగా లాక్ డౌన్ టైంలో వర్కౌట్స్ చేసి సన్నబడింది. అందుకు సంబంధించిన ఫోటోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేసి అందరినీ షాక్ కి గురి చేసింది.

అయితే తాజాగా తన శరీర ఆకృతిని మార్చడానికి గల కారణంను విద్యుల్లేఖ చెప్పుకొచ్చింది. ప్రస్తుతం సంపూర్ణేష్ బాబు హీరోగా పుడింగి నెంబర్ వన్ సినిమా లో హీరోయిన్ గా విద్యుల్లేఖ చేస్తోంది. ఈ సినిమా ప్రారంభోత్సవ కార్యక్రమంలో మాట్లాడుతూ ఎమోషనల్ అయింది. తాను ఇలా మారిపోవడానికి కారణాలు కూడా వివరించింది. ఆరోగ్య సమస్యలు లావుగా ఉండటం వల్ల ఎక్కువ అవుతున్నాయి. అందుకే నా శరీరాకృతి పైనే దృష్టి పెట్టాను. కానీ ఆ సమయంలో నా పై సోషల్ మీడియాలో కామెంట్లు ట్రోల్స్ చేశారని ఎమోషనల్ అయింది విద్యుల్లేక.

Advertisement

తాజా వార్తలు

Prabha News