Friday, March 29, 2024

బిగ్ బాస్ 5 పై క్లారిటీ ఇచ్చిన నటి సురేఖ

బుల్లితెర రియాలిటీ షో బిగ్ బాస్ సీజన్ ఫైవ్ త్వరలో ప్రారంభం కాబోతోంది. ఇప్పటికే నాలుగు సీజన్లను కంప్లీట్ చేసుకున్న ఈ షో ఇప్పుడు సీజన్ 5 ని నిర్వహించేందుకు రెడీ అవుతున్నారు. ఇప్పటికే నిర్వాహకులు సీజన్ 5 లోగో కూడా రిలీజ్ చేశారు. కాగా ఈ సీజన్ లో హౌస్ కి రాబోయేది వీరే అంటూ కొన్ని పేర్లు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. అందులో నటి సురేఖ పేరు కూడా ఉంది.

ఇక ఇదే విషయమై ఓ క్లారిటీ ఇచ్చారు సురేఖ. బిగ్ బాస్ హౌస్ లోకి వెళ్లడం లేదని… దయచేసి ఇలాంటి రూమర్స్ ని ఎంకరేజ్ చేయకండి అని చెప్పుకొచ్చింది సురేఖవాణి. ఆమె క్లారిటీతో బిగ్బాస్ సీజన్ 5 లో సురేఖ ఎంట్రీ లేదన్న సంగతి తేలిపోయింది. ఇక సెప్టెంబర్ 5వ తేదీన నుంచి షో ను ప్రారంభించాలని నిర్వాహకులు ప్లాన్ చేస్తున్నారు. సీజన్ 4కి హోస్ట్ గా వ్యవహరించిన నాగార్జునే ఈసారి కూడా హోస్ట్ గా వ్యవహరిస్తారని సమాచారం.

Advertisement

తాజా వార్తలు

Advertisement