Friday, April 19, 2024

నటి మీరా మిథున్‌ అరెస్ట్

దళితులపై అనుచిత వ్యాఖ్యలు చేసిన తమిళ నటి మీరా మిథున్‌ని చెన్నై పోలీసులు అరెస్ట్‌ చేశారు. మీరా కామెంట్స్ వీడియో కాస్త సోషల్‌ మీడియాలో వైరల్‌ కావడంతో నెటిజనులు మీరా మిథున్‌సై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మీరా కామెంట్స్ పై ఆగ్రహం వ్యక్తం చేశారు దళిత-కేంద్రీకృత పార్టీ అయిన విదుతలై సిరుతైగల్ కట్చి నాయకుడు వన్నీ అరసు. ఆయన ఇచ్చిన ఫిర్యాదు మేరకు నటిని అరెస్ట్‌ చేశారు పోలీసులు. ఈ నేపథ్యంలో చెన్నై పోలీసులు మీరా మీద ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ యాక్ట్‌ కింద కేసు నమోదు చేసి.. అరెస్ట్‌ చేశారు. కొన్ని మీడియా సంస్థల్లో వచ్చిన వార్తల ప్రకారం మీరా మిథున్ దళితుల గురించి అనుచిత వ్యాఖ్యలు చేసిన వీడియోను శనివారం సోషల్‌ మీడియాలో షేర్‌ చేశారు. ఇది కాస్త వైరల్‌ కావడంతో మీరా మిథున్‌ను అరెస్ట్‌ చేయాల్సిందిగా నెటిజనులు డిమాండ్‌ చేశారు. 

మీరా మిథున్‌ షేర్‌ చేసిన వీడియోలో.. ఆమె ఓ డైరెక్టర్‌ అనుమతి లేకుండా తన ఫోటోని అతడి మూవీ ఫస్ట్‌లుక్‌ పోస్టర్‌ కోసం వాడుకున్నాడని ఆరోపించారు. అంతటితో ఊరుకోక.. ‘‘తక్కువ జాతి అనగా దళిత సామాజిక వర్గానికి చెందిన వారి ఆలోచనలు ఇలానే ఉంటాయి. చాలా చీప్‌గా ప్రవర్తిస్తారు’’ అంటూ నోటికొచ్చినట్లు విమర్శించారు. దళితులు నేరాలకు, అంసాఘిక కార్యకలపాలకు పాల్పడటం వల్లనే వారిని సమాజంలో నీచంగా చూస్తున్నారని వ్యాఖ్యానించారు. అంతేకాక తమిళ ఇండస్ట్రీలో ఉన్న దళిత దర్శకులను, నటీనటులను బయటకు గెంటేయాలని సూచించారు. 

Advertisement

తాజా వార్తలు

Advertisement