Monday, December 2, 2024

Tirumala| శ్రీవారిని దర్శించుకున్న నటి కీర్తి సురేశ్‌

తిరుమల : కలియుగ దైవం తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామి వారిని అగ్ర కథానాయిక కీర్తి సురేశ్‌ దర్శించుకున్నారు. శుక్రవారం ఉదయం వీఐపీ విరామ దర్శన సమయంలో స్వామి వారి సేవలో పాల్గొన్నారు. కుటుంబ సభ్యులతో కలిసి ఆలయానికి చేరుకున్న నటికి అధికారులు స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు.

అనంతరం రంగనాయకుల మండపంలో శేష వస్త్రంతో సత్కరించారు. స్వామివారి చిత్రపటం, తీర్థప్రసాదాలు అందజేశారు. కీర్తి త్వరలో పెళ్లి పీటలు ఎక్కబోతున్నారంటూ వస్తున్న వార్తల నేపథ్యంలో ఆమె స్వామివారిని దర్శించుకోవడం ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.మరోవైపు తన రిలేషన్‌షిప్‌ స్టేటస్‌పై కీర్తి సురేష్ ఇటీవ‌లే అధికారిక ప్రకటన చేసిన విషయం తెలిసిందే.

ప్రియుడు ఆంటోనీతో దీపావళి సందర్భంగా తీసుకున్న ఓ ఫొటోను తన ఇన్‌స్టాగ్రామ్‌ ఖాతాలో షేర్‌ చేసింది. తమ స్నేహబంధం జీవితాంతం కొనసాగనుందని తెలిపింది. ఈ వార్త తెలుసుకున్న పలువురు సినీ సెలబ్రిటీలు కీర్తి సురేష్‌కు శుభాకాంక్షలు అందజేశారు.

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement