Thursday, April 18, 2024

తన కూతుర్ని ఎంతో ప్రేమగా పవన్ కళ్యాణ్ చూసుకుంటారు – అనన్య

పవన్ కళ్యాణ్ కు ఉన్న క్రేజ్ ఏంటో అందరికీ తెలుసు. సినిమాల్లో ఎంతో స్టైల్ గా కనిపించే పవన్ కళ్యాణ్…నిజ జీవితంలో మాత్రం చాలా సింపుల్ గా కనిపిస్తారు. అయితే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన వకీల్ సాబ్ చిత్రం శుక్రవారం ప్రేక్షకుల ముందుకు వచ్చిన సంగతి తెలిసిందే. ఈ చిత్రం బ్లాక్ బస్టర్ హిట్ గాసాధించింది. అదేవిధంగా వసూళ్లను కూడా మంచిగా రాబెడుతోంది. అయితే ఈ సినిమాలో నివేదాథామస్ ,అంజలి, అనన్య కీలక పాత్రలో నటించారు.

కాగా అనన్య తాజాగా ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ పవన్ కళ్యాణ్ షూటింగ్ లో ఉన్న సమయంలో ఎంతోమంది మెగా ఫ్యామిలీ నుండి వచ్చే వారని వారిలో కొడుకు అకీరా నందన్ కూతురు ఆద్య కూడా ఉండేవారని చెప్పుకొచ్చింది. అయితే షూటింగ్ స్పాట్ కి వచ్చిన ఆద్య తో ఎంతో ప్రేమగా పవన్ కళ్యాణ్ వుండేవాడని, ఆమె వచ్చిన దగ్గర నుంచి వెళ్లే వరకు తన వెంటే ఉంచుకునేవారని ఇంటికి వెళ్లేముందు నుదుటిపై ముద్దు పెట్టి మరీ పంపించేవారని చెప్పుకొచ్చింది. అది చూసిన నాకు పవన్ కళ్యాణ్ ఎంత పెద్ద స్టార్ అయినా సింపుల్ గా ఉంటారని అప్పుడే అర్థమైందని అనన్య పేర్కొంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement