Friday, April 19, 2024

రోడ్డు ప్రమాదంలో నటుడు మృతి

ఇండస్ట్రీలో వరుస విషాదాలు చోటు చేసుకుంటున్నాయి. ఇటీవల కాలంలో చాలా మంది కరోనా కారణంగా మృతి చెందారు. అయితే తాజాగా రోడ్డు ప్రమాదంలో జాతీయ అవార్డు గ్రహీత నటుడు మృతి చెందారు. కన్నడలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్న సంచారి విజయ్ రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడ్డారు. జూన్ 12 రాత్రి తన స్నేహితుని కలిసిన విజయ్ బైక్ పై ఇంటికి వెళుతున్న సమయంలో ఈ ప్రమాదం చోటుచేసుకుంది. కాగా ఆయనను బెంగళూరు లోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చేర్చారు. ఈ ప్రమాదంలో తల కుడికాలికి బలమైన గాయాలు అయ్యాయి.

అలాగే నిన్న ఆయన పరిస్థితి విషమంగా ఉండగా తాజాగా ఆయన కన్నుమూసినట్లు తెలుస్తోంది. విజయ్ బ్రెయిన్ డెడ్ అయిందని… చికిత్సకు స్పందించడం లేదని అంటున్నారు. ఇక విషయం తెలిసిన అభిమానులు ఆయనకు సోషల్ మీడియా ద్వారా నివాళులు అర్పిస్తున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement