Thursday, April 18, 2024

సిసిఎస్ కు నటుడు నరేష్

సీనియర్ నటుడు నరేష్ సిసిఎస్ పోలీసులను ఆశ్రయించారు. స్టోన్ ఇన్ఫ్రా కంపెనీ యజమాని లింగం శ్రీనివాస్ తమకు పది కోట్ల రూపాయల మొత్తాన్ని ఇవ్వకుండా తప్పించుకుని తిరుగుతున్నారని నరేష్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. స్టోన్ ఇన్ఫ్రా సహా రెండు మూడు కంపెనీలు ను లింగం శ్రీనివాస్ స్టార్ట్ చేశారని… మా బిల్డర్‌ ఫినిక్స్‌తో ఈయన అసోసియేట్‌ అయ్యి సైనింగ్ అథారిటీలో ఉన్నారని మా ఫ్యామిలీ దగ్గర ఆరేళ్ల ముందు దాదాపు ఏడున్నర కోట్ల రూపాయలు అప్పుగా తీసుకుని ఎటువంటి రిటర్న్స్ కూడా ఇవ్వలేదని నరేష్ అన్నారు.

ఈ విషయంలో మేము చాలా ఇబ్బంది పడ్డామని కాబట్టి సిసిఎస్ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో పాటు కోర్టుకు కూడా అప్రోచ్ అయ్యాను అని నరేష్ అన్నారు. ఇంతకు ముందు విజయవాడకు తీసుకెళ్లి తప్పించుకున్నాడని ఇప్పుడు దాదాపు పది కోట్ల రూపాయలకు పైగానే మాకు రావాల్సి ఉందని, ఈ విషయంపై తెలంగాణ పోలీసులు సెంట్రల్ క్రైమ్ డిపార్ట్మెంట్ వారు వెంటనే స్పందించారని వారికి కృతజ్ఞతలు అంటూ చెప్పుకొచ్చారు నరేష్.

Advertisement

తాజా వార్తలు

Advertisement