Thursday, April 25, 2024

నాగబాబు అలా మాట్లాడటం తప్పు…నటుడు నరేష్

మా అసోసియేషన్ ఎన్నికల నేపథ్యంలో ప్రకాష్ రాజ్ శుక్రవారం మీడియా ముందుకు వచ్చారు. అలాగే ప్రకాష్ రాజ్ తో పాటు మెగా బ్రదర్ నాగబాబు, బండ్ల గణేష్ ఇలా ప్రకాష్ రాజుకు మద్దతు తెలుపుతున్న వారంతా కూడా మీడియా ముందుకు వచ్చారు. అయితే ఈ రోజు సీనియర్ నటుడు నరేష్ మీడియా ముందుకు వచ్చారు. వస్తూ వస్తూనే మంచు విష్ణు పై పొగడ్తలతో ముంచెత్తారు. అలాగే నాలుగేళ్లుగా మా ప్రతిష్ట మసకబారింది అని నాగబాబు వ్యాఖ్యానించడాన్ని తప్పుబట్టారు నరేష్. నాగబాబు అలా అని ఉండకూడదని రెండేళ్లలో కొంత అసమ్మతి ఉన్నా… పెద్దలు అందరూ వాటిని పరిష్కరించారని చెప్పుకొచ్చారు.

నాగబాబు వ్యాఖ్యలు సంస్థను కించపరిచేలా ఉన్నాయని ఆరోపించారు నరేష్. అలాగే ప్రకాష్ రాజు గురించి మాట్లాడుతూ ప్రకాష్ రాజ్ తనకు మంచి మిత్రుడని అయితే మా మెంబర్స్ ఎంతమంది ఉంటారో కూడా తెలియని వాళ్ళు పోటీకి దిగుతున్నారని పరోక్షంగా విమర్శలు చేశారు నరేష్. ఇక మంచు విష్ణు మన ఇంటి బిడ్డని… కష్టనష్టాలు, లాభనష్టాలు తెలిసిన వ్యక్తి అని విష్ణు పోటీ చేస్తాననటం సంతోషంగా ఉందని అన్నారు నరేష్.

Advertisement

తాజా వార్తలు

Advertisement